కుటుంబాన్ని కాపాడేది కుటుంబ ప్రార్థనే!

కుటుంబాన్ని కాపాడేది కుటుంబ ప్రార్థనే! -  పరిశుద్ధ లియో XIV పాపు గారు 

పరిశుద్ధ లియో XIV పాపు గారు ఇటీవల క్రైస్తవ కుటుంబాలలో కుటుంబ ప్రార్థన తగ్గిపోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రార్థన ప్రతి కుటుంబ జీవితంలో ముఖ్యమైన భాగమని, దానిని మళ్లీ అలవాటు చేసుకోవాలని ఆయన విశ్వాసులకు పిలుపునిచ్చారు.

"ఈ రోజుల్లో సామర్థ్యం, విజయం, సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే చాలామందికి ప్రార్థన అవసరం లేనిదిగా లేదా పెద్దగా ఉపయోగం లేనిదిగా అనిపిస్తోంది," అని పరిశుద్ధ లియో XIV పాపు గారు ఆగస్టు 5న జరిగిన సాధారణ సమావేశంలో అన్నారు.

రెండవ వాటికన్ సభ బోధనలను కొనసాగిస్తూ, పరిశుద్ధ లియో XIV పాపు గారు ప్రార్థన అనేది వ్యక్తిగత విషయమే కాకుండా, సంఘంగా కలిసి చేసే ఆరాధన అని వివరించారు. చాలామంది ప్రార్థనను కేవలం మనశ్శాంతి కోసం చేసే ఒక సాధనంగా మాత్రమే భావిస్తున్నారు. కానీ ప్రార్థన అంతకంటే గొప్పది," అని ఆయన అన్నారు.

ప్రార్థన మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. దాని నిజమైన విలువను ప్రతి ఒక్కరూ మళ్లీ గుర్తించి, కుటుంబాల్లో ప్రార్థనను పునరుద్ధరించాలి," అని పరిశుద్ధ లియో XIV పాపు గారు పిలుపునిచ్చారు.

Article and design by M Kranthi Swaroop

Telugu Survey Popup Image