ఆఫ్రికా దేశాలలో అపోస్టోలిక యాత్రను ముగించుకున్న పోప్


ఈక్వటోరియల్ గినియా మరియు నాలుగు ఆఫ్రికా దేశాలలో తన అపోస్టోలిక యాత్రను, ఏప్రిల్ 22, బుధవారం నాడు మలాబోలో ఒక సంక్షిప్త వీడ్కోలు ప్రసంగంతో ముగించారు. దీంతో ఆ ఖండంలో పోప్ లియో 11 రోజుల పర్యటన ముగిసింది.

మలాబో స్టేడియంలో జరిగిన దివ్యబలి పూజ ముగింపులో విశ్వాసులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ యాత్రను చేపట్టే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, "బయలుదేరడానికి సమయం ఆసన్నమైంది" అని పోప్ పేర్కొన్నారు.

170 సంవత్సరాలుగా సువార్త వెల్లివిరుస్తున్న ఈ భూమిలో ప్రయాణిస్తున్న "దేవుని ప్రజలు"గా వారిని అభివర్ణిస్తూ, అగ్రపీఠాధిపతులకు, పీఠాధిపతులు, గురువులకు మరియు విస్తృత సమాజానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ పర్యటన  నిర్వహణ మరియు విజయానికి సహకరించిన దేశ పౌర అధికారులకు మరియు అందరికీ పోప్ ప్రశంసలను తెలియజేశారు.

ఈ పర్యటన అంతటా తాను పొందిన పరిచయాలు, సాక్ష్యాలు మరియు అనుభవాల ద్వారా రూపుదిద్దుకున్న "అపారమైన విశ్వాసం, నిరీక్షణ మరియు ప్రేమ అనే నిధితో" తాను తిరిగి వెళ్తున్నానని పోప్  అన్నారు.

"ఈ నిధిలో సంతోషకరమైన మరియు దుఃఖకరమైన కథలు, సాక్ష్యాలు ఉన్నాయి, ఇవి పేతురు వారసుడిగా నా జీవితాన్ని మరియు పరిచర్యను ఎంతగానో సుసంపన్నం చేస్తాయి," అని ఆయన అన్నారు.

క్రైస్తవ మత తొలి శతాబ్దాలలో వలె, విశ్వాసుల పవిత్రతకు మరియు మిషనరీ స్వభావానికి దోహదపడటానికి ఈ ఖండం పిలువబడిందని పోప్ లియో అన్నారు.

ఈక్వటోరియల్ గినియా ప్రజలను మరియు ఆఫ్రికా ఖండమంతటినీ మరియ తల్లి మధ్యవర్తిత్వానికి అప్పగిస్తూ, ఇక్కడ ఉన్న కుటుంబాలు, సంఘాలు మరియు దేశాల పట్ల ఆమె సంరక్షణను ప్రార్థిస్తూ పోప్ ప్రసంగాన్ని ముగించారు.