అమెరికా-ఇరాన్ ఒప్పందం యుద్ధానికి పరిష్కారం కావాలన్న పోప్
కాస్టెల్ గాండోల్ఫోలోని తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, పోప్ లియో అమెరికా మరియు ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం (MoU), స్పెయిన్కు తాను చేసిన ఇటీవలి పర్యటన గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
మంగళవారం జూన్ 16 న 'విల్లా బార్బెరిని' వెలుపల వేచి ఉన్న విలేకరులతో మాట్లాడటానికి పోప్ ఆగి వారితో సంభాషించారు.
టెనెరిఫ్ నుండి తిరిగి వచ్చే విమానంలో జరగాల్సిన విలేకరుల సమావేశం కోసం సిద్ధమైన స్పానిష్ మీడియా ప్రతినిధులతో ఆయన తన సంభాషణను ప్రారంభించారు; అయితే సాంకేతిక లోపం కారణంగా ఆయన వేరే విమానంలో తిరిగి రావాల్సి రావడంతో ఆ సమావేశం అప్పట్లో జరగలేదు.
అమెరికా మరియు ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం గురించి అడిగినప్పుడు, 'దేవునికి కృతజ్ఞతలు, ఈ ఒప్పందం (MoU) పై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, దీనిపై వారు శుక్రవారం అధికారికంగా సంతకాలు చేయనున్నారు." అని పోప్ అన్నారు
"ఇంకా అనేక అంశాలను ఖరారు చేయాల్సి ఉంది," అని పోప్ జోడించారు, "అయితే యొద్దం కంటే, చర్చలు మరియు సంప్రదింపుల ద్వారా పరిష్కారం కనుగొనడం ఎప్పటికి మంచిది."అని పోప్ అన్నారు
ఈ ఒప్పందం "యుద్ధానికి నిజమైన పరిష్కారం కావాలని, అది ముగిసిపోవాలని మరియు అందరి శ్రేయస్సు కోసం మనం ముందుకు సాగాలని" పోప్ ఆకాంక్షించారు.
అణు ఆయుధాలను తొలగించడం, ప్రజలందరి శ్రేయస్సును కోరుకోవడం మరియు దీనివల్ల తలెత్తిన ఆర్థిక, సామాజిక సమస్యలను పరిష్కరించే మార్గాలను అన్వేషించడం వంటివి జరగాలి.