అనాయాస మరణంపై కీలక వ్యాఖ్యలు చేసిన పోప్

" Notre Dame Welcome Center " లూర్ద్‌లోని గ్రొట్టోకు ఎదురుగా, పావ్ నది అవతల ఉంది.

అనారోగ్యంతో ఉన్నవారు, వైకల్యంతో బాధపడుతున్న తీర్థయాత్రికులు తమ యాత్రను సులభం చేసుకునేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
 
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అనేక మంది ఈ కేంద్రంలో బస చేస్తుంటారు. 1997లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 7.5 లక్షల మంది ఇక్కడికి వచ్చారు.

ఈ కేంద్రంలోని సిబ్బంది, స్వచ్ఛంద సేవకులతో పాటు,అనారోగ్యంతో ఉన్న వారితో పోప్ లియో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారని పోప్ వారికి  తెలిపారు.

కొన్నిసార్లు అనారోగ్యంతో ఉన్నవారు ఇతరులకు తాము భారంగా మారామని భావించవచ్చని, అయితే తమను తాము మరో విధంగా చూడాలని వారికి సూచించారు.

ఫ్రాన్స్‌లో అనాయాస మరణానికి సంబంధించిన చట్టం ఆమోదం పొందిన కొన్ని నెలలకే, పోప్ ఈ అంశంపై నేరుగా స్పందించారు.

“ప్రాణాన్ని అంతం చేయడాన్ని సాధారణమైన విషయంగా పరిగణించడం అసాధ్యం. చట్టబద్ధమైనది తప్పనిసరిగా నైతికమైనది కాదు.”

వైద్య రంగంలో పనిచేస్తున్న వారికి కూడా పోప్ లియో బలమైన సందేశాన్ని ఇచ్చారు. వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యత యొక్క అసలు అర్థాన్ని గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.
 

Telugu Survey Popup Image