ప్రేమకు మతం లేదు… సేవకు సరిహద్దులు లేవు

ప్రేమకు మతం లేదు… సేవకు సరిహద్దులు లేవు

కేరళలోని కొట్టాయంలో ఒక అనాథ ఆశ్రమంలో పెరిగిన పార్వతి అనే హిందూ యువతి వివాహంలో క్రైస్తవ మతగురువు ఫాదర్ రాయ్ మాథ్యూ గారు  వధువు తండ్రి స్థానంలో ఉండి 'కన్యాదానం' జరిపించారు. ఈ సంఘటన మతాలకతీతమైన మానవత్వానికి చిహ్నంగా నిలిచింది.

కేరళ లోని కొట్టాయం జిల్లాలో ఉన్న బెత్లేహెం ఆశ్రమం అనే అనాథాశ్రమంలో పార్వతి చిన్నప్పటి నుంచే పెరిగింది. ఆమె కేవలం ఒక సంవత్సరం వయసులోనే తల్లిని కోల్పోయింది. ఆమెను చూసుకునే వాళ్లు లేకపోవడంతో స్థానికులు ఆ ఆశ్రమానికి తీసుకువచ్చారు. అక్కడే ఆమె జీవితం మారింది.

 చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన  పార్వతి ను, ఫాదర్ రాయ్ తన సొంత కూతురులా చూసుకున్నారు. అయన ప్రేమగా “శ్రీకుట్టి” అని పిలిచేవారు. చదువు పూర్తయ్యాక ఆమె డయాలిసిస్ టెక్నీషియన్ కోర్సు కూడా చేశారు. 

తర్వాత పార్వతికి అనంతు అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. ముఖ్యంగా ఈ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరగాలని నిర్ణయించారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా ఫాదర్ రాయ్ స్వయంగా చూసుకున్నారు.

ఏప్రిల్ లో జరిగీన ఈ పెళ్లిలో అత్యంత భావోద్వేగ క్షణం ఏమిటంటే — ‘కన్యాదానం’ సమయంలో వధువు తండ్రి చేతిని వరుడికి అప్పగించాలి. కానీ పార్వతికి తండ్రి లేకపోవడంతో, ఆమె జీవితంలో తండ్రిగా నిలిచిన ఫాదర్ రాయ్ ముందుకు వచ్చి ఆ బాధ్యతను తీసుకున్నారు. తరువాత, తన సేవా జీవితంలో అత్యంత అర్థవంతమైన క్షణాలలో ఇది ఒకటని ఫాదర్ రాయ్ గారు  పేర్కొన్నారు.

ఈ విశిష్టమైన ఘట్టం మతపరమైన సరిహద్దులకు అతీతంగా మానవత్వం, సంబంధాలు మరియు కుటుంబం యొక్క అర్థం వంటి అంశాలపై చర్చలను రేకెత్తించింది.

Article and Design By M Kranthi Swaroop