పడవ ప్రమాదం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన శాంట్'ఎగిడియో కమ్యూనిటీ
పడవ ప్రమాదం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన శాంట్'ఎగిడియో కమ్యూనిటీ
మధ్యధరా సముద్రంలో ఇటీవల జరిగిన వలసదారుల ఓడ ప్రమాదం పట్ల రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న శాంట్'ఎగిడియో కమ్యూనిటీ (Community of Sant'Egidio) తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
ఈస్టర్ రాత్రి జరిగిన ఈ విషాదం, పలువురు ప్రాణాలతో బయటపడిన వారిని రక్షించిన తర్వాతే వెలుగులోకి వచ్చింది.లిబియాలోని జజౌరా నుండి సుమారు 105 మందితో ఆ పడవ బయలుదేరిందని వారు తెలిపారు. కేవలం 32 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు నిర్ధారించబడింది.
గత వారం కూడా టర్కీలోని బోడ్రమ్ సమీపంలో ఏజియన్ సముద్రంలో ఒక పసికందుతో సహా 19 మంది ఆఫ్ఘన్ వలసదారులు మరణించిన మరో విషాద ఘటన జరిగింది.
ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ ఐఓఎం ప్రకారం, 2026 సంవత్సరం ప్రారంభం నుండి కనీసం 683 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు లేదా అదృశ్యమయ్యారు.
సహాయక చర్యలు మరియు బలహీన వర్గాల ప్రజల సురక్షిత ప్రయాణానికి సంబంధించి మెరుగైన, మరింత మానవతా దృక్పథంతో కూడిన విధానం అమలు చేయాలని తమ పిలుపును శాంట్'ఎగిడియో కమ్యూనిటీ పునరుద్ఘాటించింది.
గత దశాబ్దంలో శాంట్'ఎగిడియో భాగస్వామ్య సంస్థలతో కలిసి ప్రోత్సహించిన ప్రాజెక్ట్, ఇప్పటివరకు 8,500 మందికి పైగా నిస్సహాయ ప్రజలును సురక్షితంగా యూరప్‌కు చేరుకోవడానికి సహాయ చేసింది.
శాంట్'ఎగిడియో కమ్యూనిటీ (Community of Sant'Egidio) అనేది 1968లో రోమ్‌లో ఆండ్రియా రికార్డి స్థాపించిన ఒక అంతర్జాతీయ లే కాథలిక్ ఉద్యమం. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలలో, 60,000 మందికి పైగా సభ్యులతో (స్వచ్ఛంద సేవకులు) చురుకుగా పనిచేస్తోంది.
Article and design by M Kranthi Swaroop