జకార్తా పర్యటనలో 'మత సామరస్యానికి పిలుపునిచ్చిన' పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
సెప్టెంబరు 5న ఇండోనేషియా,జకార్తాలోని ఇస్తిఖ్లాల్ మసీదులో సర్వమత సమావేశంలో భాగంగా హింసకు వ్యతిరేకంగా పోరాడటానికి మరియు భూమిని రక్షించడానికి కలిసి పని చేస్తామని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మరియు గ్రాండ్ ఇమామ్ నసరుద్దీన్ ఉమర్ గారు ప్రతిజ్ఞ చేశారు.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మరియు గ్రాండ్ ఇమామ్ నసరుద్దీన్ ఉమర్ పరస్పర గౌరవం మరియు స్నేహానికి ప్రతీకాత్మక సంజ్ఞతో వారి ఉమ్మడి ప్రకటనను ముద్రించారు.
గ్రాండ్ ఇమామ్ పోపు గారి శిరస్సును ముద్దాడిన తర్వాత, పోప్ ఫ్రాన్సిస్ ఇమామ్ చేతిని పట్టుకుని ముద్దాడారు, ఇది మతాంతర సంభాషణ మరియు సహకారం పట్ల వారి నిబద్ధతను సూచిస్తుంది.
ఈ అపోస్టోలిక పర్యటన యొక్క మూడవ రోజు సందర్భంగా "మానవ గౌరవాన్ని రక్షించడానికి, పేదరికాన్ని అంతం చేయడానికి, శాంతిని పెంపొందించడానికి మత సామరస్యాన్ని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి వక్కాణించారు .
ఈ సమావేశానికి హాజరైన కథోలికులు, ఇస్లాం, బౌద్ధమతం, హిందూ మతం, కన్ఫ్యూషియనిజం మరియు ప్రొటెస్టంటిజం ప్రతినిధులతో మాట్లాడుతూ, "స్నేహం, సంరక్షణ మరియు అన్యోన్యత యొక్క బంధాలను" పెంపొందించుకోవడానికి కష్టాల మధ్య సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలని పరిశుద్ధ పోపు గారు పిలుపునిచ్చారు .