హైదరాబాద్ అగ్రపీఠంలో మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ అగ్రపీఠం,సుల్తాన్ బజార్, సెయింట్ థామస్ దేవాలయంలో మార్చి 10,2024 న    అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 

సెయింట్ థామస్ విచారణ కర్త గురుశ్రీ ప్రభుదాస్ మరియు గురుశ్రీ సురేష్ దివ్యబలి పూజను సమర్పించారు. సుమారు 70 విచారణ మహిళలు పాల్గొన్నారు. 

ఆదరాభిమానాలు , ఆప్యాయతలు కనపరుస్తూ మానవ సంబంధాలు పెంచేది స్త్రీలేనని,
తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయగల నేర్పు ఓర్పు సమర్ధత స్త్రీలకే ఉందన్నారు" గురుశ్రీ ప్రభుదాస్ 

మహిళలను గుర్తించి మాకోసం ప్రత్యేక దివ్యబలి పూజ సమర్పించడం చాలా బాగుంది, మాకోసం ప్రార్ధించినందుకు గురుశ్రీ ప్రభుదాస్ మరియు గురుశ్రీ సురేష్ గార్లకు కృతజ్ఞతలు అని రేచల్, విచారణ యువతి అన్నారు 

కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి విచారణ కర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 
 

Telugu Survey Popup Image