యువత ప్రపంచానికి ఆశాజ్యోతులుగా మారాలని పిలుపునిచ్చిన పోప్

యువత ప్రపంచానికి ఆశాజ్యోతులుగా మారాలని పిలుపునిచ్చిన పోప్

చికాగో అగ్రపీఠానికి చెందిన పోప్ లియో ఇటీవల ఎన్నికకు గౌరవసూచకంగా జూన్ 14, శనివారం తన స్వస్థలమైన చికాగో రేట్ ఫీల్డ్ వద్ద వేలాది మంది యువకులు గుముగూడి వేడుకను నిర్వహించారు 

కొత్తగా ఎన్నికైన పోప్, గతంలో తాను సేవనందించిన పెరూలోని Chiclayo అగ్రపీఠం ప్రజలకు కృతజ్ఞతలు మరియు ప్రపంచంలోని యువతకు ప్రోత్సాహాన్ని ఒక వీడియో సందేశంలో వ్యక్తం చేశారు.

త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి Cardinal Blase Cupich, సహాయక పీఠాధిపతులు, మతాధికారులు, విశ్వాసులు మరియు అగ్రపీఠ యువత హాజరయ్యారు.

తన సందేశంలో, త్రిత్వం  దైవిక ప్రేమ మరియు ఐక్యతకు నమూనాగా ఉందని పోప్ అన్నారు 

 "ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు వీరు ఐక్యంగా జీవిస్తూ, ఆ సహవాసాన్ని మనందరితో పంచుకుంటారు" అని ఆయన అన్నారు, అదే ప్రేమ స్ఫూర్తితో వారి స్వంత సంబంధాలలో  మరియు సంఘాలలో జీవించాలని తన యువ శ్రోతలను ఆహ్వానించారు.

దేవుని ప్రేమ నిజంగా మనల్ని స్వస్థపరచగలదని నమ్మితే, ప్రభుని కృపను మనం కనుగొనగలం” అని ఆయన అన్నారు

విభజన మరియు నిరాశ భారిన పడుతున్న ప్రపంచంలో “ఆశాజ్యోతులుగా” జీవించాలని  పిలుపునిచ్చారు.

Telugu Survey Popup Image