భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం

భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం

విశాఖ అతిమేత్రాసనం క్రీస్తురాజు పుణ్యక్షేత్రం, క్రీస్తురాజుపురం, ఎర్ర సామంత వలస  గిరిజన విచారణలో మ్రాని కొమ్మల ఆదివారం  భక్తిశ్రద్ధలతో జరిగింది. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, యర్రసామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి. జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ మ్రాని కొమ్మల ఆదివారం పండుగ కడు ఆత్మీయంగా భక్తి శ్రద్ధలతో జరిగింది.

 అధికసంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు.  యేసు ప్రభువుని యెరూషలేము పురప్రవేశము’ అనే సంఘటనను ధ్యానిస్తూ ,   యేసు ప్రభువువారు  యెరూషలేములో ప్రవేశించినపుడు, అతనికి ముందు వెనుక వచ్చిన జనసమూహము, “దావీదు కుమారా! హోసాన్న! అని చేసిన విజయ ధ్వానములు  గుర్తు చేసుకుంటూ  ప్రతిఒక్కరు మ్రాని కొమ్మలను పట్టుకొని గురువులతో కలసి పాదయాత్రగా దేవాలయం చేరుకున్నారు.

గురుశ్రీ పి. జీవన్ బాబు గారు మ్రాని కొమ్మల ఆదివారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసారు. ప్రభుయేసుని తగ్గించుకుకొనే గుణం, అయన ప్రేమను ,జాలిని ,కరుణను విశ్వాసులకు తెలియజేసారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer

 

 

 

Telugu Survey Popup Image