నూతన నియామకాలు
పోప్ ఫ్రాన్సిస్ గారు డిసెంబరు 30, 2023న వివిధ మేత్రాసనాలకు ఒక అగ్రపీఠాధిపతిని మరియు ముగ్గురు పీఠాధిపతులను నియమించారు.
వారు :
రాంచీ అగ్రపీఠాధిపతులుగా మహా పూజ్య విన్సెంట్ ఐంద్,
నాసిక్ పీఠాధిపతులుగా మహా పూజ్య బార్తోల్ బారెట్టో,
ఝబువా పీఠాధిపతులుగా గురుశ్రీ పీటర్ రుమల్ ఖరాడి,
ఔరంగాబాద్ పీఠాధిపతులుగా గురుశ్రీ బెర్నార్డ్ లాన్సీ పింటో
జేసుసభకు చెందిన మహా పూజ్య ఫెలిక్స్ టోప్పో (76) రాజీనామాను పోపు గారు ఆమోదించి రాంచీ,బాగ్డోగ్రా పీఠాధిపతి మహా పూజ్య విన్సెంట్ ఐండ్ (68) గారిని రాంచీ అగ్రపీఠాధిపతిగా నియమించారు.
మహారాష్ట్ర నాసిక్ మేత్రాసన పాస్టరల్ కేర్‌కు చెందిన మహా పూజ్య లూర్దునాద్ డానియల్ (76) గారి రాజీనామాను పోపు గారు ఆమోదించి బొంబాయి సహాయక పీఠాధిపతులు మహా పూజ్య బార్తోల్ బారెట్టో (62)గారిని నాసిక్ పీఠాధిపతిగా నియమించారు.
గురుశ్రీ పీటర్ రుమాల్ ఖరాడి (64) గారిని ప్రస్తుతం ఝబువా మేత్రాసన అడ్మినిస్ట్రేటర్ గా తమ సేవలందిస్తున్నారు.
గురుశ్రీ బెర్నార్డ్ లాన్సీ పింటో (60) ప్రస్తుతం ముంబై, మాహిమ్ -సెయింట్ మైఖేల్స్ చర్చి విచారణ కర్తలుగా సేవలందిస్తున్న వారిని, ఔరంగాబాద్ కోడ్జూటర్ బిషప్‌గా నియమించారు.