డిజిటల్ మీడియా సేవలో దివ్యవాణి కొత్త చరిత్ర
మన దివ్యవాణి టీవీ తన "తొలి డిజిటల్ మీడియా బ్యాచ్ పట్టభద్రుల స్నాతకోత్సవం" ఘనంగా నిర్వహించింది.ఈ పట్టభద్రుల వేడుక మే 29న , దివ్యవాణి లో జరిగింది.
దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ చైర్మన్ , ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య . పోలిమేర జయరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని కోర్సును అభ్యసించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో దివ్యవాణి టీవీ CEO ఫాదర్ లూర్ధురాజ్ ఎస్.జె గారు, ఫాదర్ యేసుబాబు కల్లేపల్లి, ఫాదర్ థామస్ క్రిస్టోఫర్ గార్లు పాల్గొన్నారు.
దివ్యవాణి టీవీ CEO ఫాదర్ లూర్ధురాజ్ గారు మాట్లాడుతూ "డిజిటల్ మీడియా నేటి కాలంలో సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేసే సాధనం మాత్రమే కాకుండా, ప్రజలతో ప్రత్యక్షంగా అనుసంధానమయ్యే వేదికగా కూడా మారింది" అని అన్నారు. కంటెంట్ సృష్టికర్తలు నిజమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడం ద్వారా సమాజానికి సేవ చేయగలరు అని ఫాదర్ లూర్ధురాజ్ గారు అన్నారు.
డిజిటల్ యుగంలో సమర్థవంతంగా సమాచారాన్ని పంచుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు, నైతిక విలువలను అందించడమే ఈ కోర్సు లక్ష్యంగా దీనిని నిర్వహించారు .మొత్తం 17 మంది విద్యార్థులు నెల రోజులపాటు ఈ కోర్సును అభ్యసించి, విజయవంతంగా పూర్తి చేసి సర్టిఫికెట్లు అందుకున్నారు.
విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల ప్రదర్శన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆధునిక మీడియా ద్వారా మంచి విలువలను ప్రజలకు చేరవేసి, శ్రీసభ సేవలో భాగస్వాములయ్యే కొత్త తరం కమ్యూనికేటర్లను తయారు చేయాలనే దివ్యవాణి టీవీ లక్ష్యాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.
Article and design by M Kranthi swaroop