గురుశ్రీ స్టాన్ స్వామి కేసును విచారించేందుకు భారత కోర్టు మళ్లీ నిరాకరించింది

గురుశ్రీ స్టాన్ స్వామి కేసును విచారించేందుకు భారత కోర్టు మళ్లీ నిరాకరించింది

 ఉగ్రవాద నిరోధక కేసు నుంచి దివంగత జెస్యూట్ ఫాదర్ గురుశ్రీ  స్టాన్ స్వామి గారిని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు మహారాష్ట్రలోని అత్యున్నత న్యాయస్థానం ఎనిమిదోసారి నిరాకరించింది.

దేశంలోని 16 మంది ప్రముఖ కార్యకర్తలపై దాఖలైన ఏడేళ్ల ఎల్గార్ పరిషత్-భీమా కోరేగావ్ కేసు నుంచి గురుశ్రీ  స్టాన్ స్వామి గారి పేరును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించకుండా బాంబే హైకోర్టు న్యాయమూర్తి రేవతి మోహితే-దేరే సెప్టెంబర్ 20న విచారణ నుంచి తప్పుకున్నారు.

మహారాష్ట్ర రాజధాని ముంబై లో ఉన్న పిటిషనర్, జెస్యూట్ ఫాదర్ గురుశ్రీ ఫ్రేజర్ మస్కరెన్హాస్ గారు UCA న్యూస్‌తో మాట్లాడుతూ "ఈ కేసును విచారించడానికి నిరాకరించిన హైకోర్టులో ఇది ఎనిమిదో బెంచ్" అని అన్నారు.

జులై 5, 2021న గురుశ్రీ  స్టాన్ స్వామి గారు  కస్టడీలో మరణించిన తర్వాత 2021 డిసెంబర్‌లో కేసు దాఖలు చేసేందుకు జెస్యూట్‌లు డెలిగేట్‌గా నియమించిన గురుశ్రీ మస్కరెన్హాస్ గారు మాట్లాడుతూ  "ఎందుకంటే ఇది స్పష్టంగా మాకు అనుకూలంగా ఉంది" అని హైకోర్టులోని ఏ బెంచ్ కూడా ఈ కేసును విచారించడానికి ఇష్టపడదు అని అన్నారు.

“ఈ కేసును విచారించడానికి ఎనిమిది బెంచ్‌లు ఎందుకు నిరాకరించాయో మాకు ఇంకా తెలియలేదు అని ,  గురుశ్రీ  స్టాన్ స్వామి గారికి న్యాయం జరగకుండా పోయిందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనం ' అని గురుశ్రీ మస్కరెన్హాస్ అన్నారు.

84 ఏళ్ల గురుశ్రీ  స్టాన్ స్వామిని అక్టోబర్ 8, 2020న తూర్పు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలోని ఆయన నివాసం లో  అరెస్టు చేశారు.

దేశద్రోహం, చట్టవిరుద్ధమైన మావోయిస్టు గ్రూపుతో సంబంధాలు కలిగి ఉండటం, మోడీని చంపే కుట్రలో భాగమని ఆయనపై ఆరోపణలు మోపారు.

గురుశ్రీ స్టాన్ స్వామి గారు వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ వివిధ  కారణాలతో బెయిల్ నిరాకరించారు.   జూలై 5, 2021న ఖైదీగా గురుశ్రీ స్టాన్ స్వామి గారు ముంబై ఆసుపత్రిలో మరణించారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer