క్రాన్స్-మోంటానా అగ్నిప్రమాద బాధితులకు ఓదార్పునందించిన పోప్
"జనవరి 1న స్విట్జర్లాండ్‌లోని Crans-Montanaలో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 40 మంది మరణించగా, దాదాపు 120 మంది తీవ్రంగా గాయపడిన విషాద సంఘటన జరిగి నెలరోజులు కావస్తుండగా, భాదిత కుటుంబాలకు నా సాన్నిహిత్యం మరియు ఆప్యాయతను తెలియజేయాలనుకుంటున్నాను అని పోప్ లియో తన సందేశంలో రాసారు.
జనవరి 15న, ski resort పట్టణంలోని ఒక బార్‌లో రద్దీగా ఉన్న నూతన సంవత్సర వేడుకలో జరిగిన అగ్నిప్రమాదం మరియు పేలుడు కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులతో పోప్ లియో వాటికన్‌లో సమావేశమయ్యారు.
‘నేను మిములను వ్యాకుల మాతకు మాత్రమే అప్పగించగలను.’ అని పోప్ తన సందేశంలో అన్నారు
ప్రభువు ఈ రోజు వారు అనుభవిస్తున్న దానిలో పాలుపంచుకుంటాడు, కానీ వారితో "తన మహిమాన్వితమైన మరియు ఆశీర్వాదకరమైన పునరుత్థానాన్ని" కూడా పంచుకుంటాడు అని పోప్ అన్నారు.
ఒక రోజు వారు కోల్పోయిన వారిని మళ్ళీ చూస్తారని మరియు వారి హృదయాలలో ఆనందం తిరిగి వస్తుందని ఆశను కొనసాగించాలని పోప్ అన్నారు.