క్రీస్తు రాజు పుణ్యక్షేత్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
క్రీస్తు రాజు పుణ్యక్షేత్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
విశాఖ అతిమేత్రాసనం,ఎర్ర సామంత వలస గిరిజన విచారణ, క్రీస్తు రాజు పుణ్యక్షేత్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఎర్ర సామంత వలస విచారణ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు .
శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కంటి ఆసుపత్రి వైద్య బృందం నిర్వహించిన ఈ శిబిరంలో 350 మందికి నేత్ర పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఇందులో 122 మంది రోగులకు కంటి ఆపరేషన్లు చేసారు. కంటి చూపు మందగించిన 90 మందికి కళ్లద్దాలను అందించారు.
విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్రసామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారు పేదలకు వైద్యసేవలు అందిస్తున్న శంకర్ ఫౌండేషన్ బృందాన్ని అభినందించారు. వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు. గురుశ్రీ యేసు గారు ఎప్పటిలానే తన సహాయ సహకారాలను అందించారు.
గురుశ్రీ పి జీవన్ బాబు గారు రోగులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer