అనంతపురంలో కార్మెల్ మాత మహోత్సవము

కర్నూలు మేత్రాసనం, అనంతపురం టౌన్, కార్మెల్ మాత దేవాలయంలో  జులై 16 ,2024 న కార్మెల్ మాత మహోత్సవము ఘనంగా జరిగింది.

కర్నూలు పీఠకాపరి మాన్యశ్రీ  గోరంట్ల జ్వానేస్ తండ్రి గారు దివ్యబలి పూజను సమర్పించి కార్మెల్ మాత యొక్క విశిష్టతను ఆ తల్లి మానవాళికి చేస్తున్నటువంటి సేవలను ప్రజలకు తెలియచేసి, కార్మెల్ మాత ప్రార్ధన సహాయంతో విశ్వాసులంతా క్రీస్తుప్రభుని అమూల్యమైన వారలను స్వీకరించాలని ప్రసంగించారు.

పీఠాధిపతులవారు మొట్టమొదటిసారి విచారణకు విచ్చేయగా విచారణ విశ్వాసుల ఊరేగింపుగా స్వాగతం పలికారు. 

20 మంది చిన్నారులు నూతన దివ్యసత్ప్రసాదాన్ని  స్వీకరించారు.

25 మంది గురువులు,32 మంది మఠవాసులు, సుమారు 1200 విశ్వాసులు ఈ మహోత్సవములో పాల్గొన్నారు 

విచారణ కర్తలు గురుశ్రీ సుగదాసి జోసఫ్ గారు విచ్చేసిన పీఠాధిపతులు, గురువులకు,మఠవాసులకు, సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసారు. 

దివ్యబలి పూజ అనంతరం విచారణ కర్తలు ప్రేమ విందు ఏర్పాటు చేశారు
 

Tags
Telugu Survey Popup Image