అదానీ స్వాధీనం చేసుకున్న కతోలిక పాఠశాల

అదానీ స్వాధీనం చేసుకున్న కతోలిక పాఠశాల

భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, గౌతమ్ అదానీ, ఐదు దశాబ్దాలకు పైగా కార్మెలైట్ మఠకన్యలు(Sisters)  నడుపుతున్న మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిమెంట్ నగర్‌లోని మౌంట్ కార్మెల్ ఉన్నత పాఠశాలను స్వాధీనం చేసుకున్నారు.

 మౌంట్ కార్మెల్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్(Mount Carmel Convent Senior Secondary School) నిర్వహణను సెప్టెంబరులో  మదర్ ఆఫ్ కార్మెల్ (CMC) నుండి అదానీ ఫౌండేషన్  తీసుకుంది.

ఈ స్కూల్‌లో పిల్లలకు మఠకన్యలు (Sisters) చక్కగా చదువు చెబుతారన్న పేరుంది. మదర్ ఆఫ్ కార్మెల్ (CMC) ఆధ్వర్యంలో 1972 నుంచి ఈ స్కూల్ నడుస్తోంది.

ఇది భారతదేశంలోని ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ, అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ (ACC) యాజమాన్యం ఆదీనంలో ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ACC తన నిధులతో ఈ పాఠశాలను నిర్మించింది మరియు నిర్వహణను CMC మఠకన్యలు (Sisters)కు అప్పగించింది. దీనిని అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ నుండి కొనుగోలు చేసింది.

అదానీ ఫౌండేషన్  పాఠశాలకు "మౌలిక సదుపాయాల పెంపుదల చాలా అవసరం అని తెలిపింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన ఉపాధ్యాయ శిక్షణ మరియు విద్యార్థుల సహాయ సేవలతో సహా పలు కీలకమైన మెరుగుదలలను ప్రారంభించినట్లు అదానీ ఫౌండేషన్ తెలిపింది.

"వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యనిచ్చే అదానీ గ్రూప్ కింద మేం పని చేయలేం అని టీచర్లంతా ఉద్యోగం మానేశారు. వారి విధానం, మా విధానం పూర్తిగా భిన్నం. అందుకే స్కూల్ ఆయన స్వాధీనంలోకి వెళ్లిపోయాక సెప్టెంబరు 1 నుండి స్కూల్‌కు వెళ్లడం మానేశాం." అని మాజీ ప్రిన్సిపాల్ సిస్టర్ లీనా తెలిపారు. గతంలో ACC ఆహ్వానం మేరకే మహారాష్ట్ర మారుమూల ప్రాంతంలోని పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు ఇక్కడకు వచ్చామని ఆమె చెప్పారు.

మఠకన్యలు ఇకపై నిర్వహణలో పాలుపంచుకోనందున, మౌంట్ కార్మెల్ పేరును  తొలగించాలని అదానీ సమూహాన్ని మదర్ ఆఫ్ కార్మెల్ (CMC)కి చెందిన మఠకన్యలు(Sisters) కోరారు.

పాఠశాల నిర్వహణలో అదానీ గ్రూప్ జోక్యం చేసుకోవడం వల్లే మఠకన్యలు బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని పాఠశాల పర్యవేక్షకులు మరియు  చందా బిషప్ మహా పూజ్య  ఎఫ్రెమ్ నారికులమ్ గారు చెప్పారు.

 Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer