స్పెయిన్ ప్రధానమంత్రితో సమావేశమైన పోప్

స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ ప్రతినిధుల సభను సందర్శించడానికి ముందు, పోప్ లియోను వ్యక్తిగతంగా కలిసారు

స్పెయిన్ పార్లమెంట్ సభ్యులతో సమావేశం కోసం కాంగ్రెస్ ఆఫ్ డిప్యూటీస్‌కు వెళ్లే ముందు, మాడ్రిడ్ పర్యటనలో మూడవ రోజైన జూన్ 8 ఉదయం, పోప్ లియో స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌తో క్లుప్తంగా సమావేశమయ్యారు.

పోప్ అనంతరం ప్రధానమంత్రి సహచరులలో కొందరిని పలకరించారని కూడా పేర్కొంటూ, హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ఈ సమావేశాన్ని టెలిగ్రామ్ ద్వారా తెలియజేసింది.

ఈ ఏకాంత సమావేశం సుమారు 20 నిమిషాల పాటు కొనసాగింది అనంతరం వీరు కాంగ్రెస్ ఆఫ్ డిప్యూటీస్‌కు వెళ్లారు.

Tags