సువార్తీకరణ విభాగ అదనపు కార్యదర్శిగా సిస్టర్ మేరీ నియామకం

గురువారం అక్టోబర్ 8 న సిస్టర్ మేరీ తెరిసా బారన్ (N.S.A.)ను సువార్తీకరణ విభాగ అదనపు కార్యదర్శిగా, పొంటిఫికల్ మిషన్ సొసైటీల అధ్యక్షురాలిగా పోప్ లియో నియమించారు 

ప్రస్తుతం ఆమె అవర్ లేడీ ఆఫ్ అపోస్టల్స్ మిషనరీ సిస్టర్స్ సభకు సుపీరియర్ జనరల్‌గా సేవలందిస్తున్నారు. 2027 జనవరి 4న తాను ఈ నూతన బాధ్యతలను స్వీకరించనున్నారు.

సిస్టర్ మేరీ తెరిసా బారన్ 1968 నవంబర్ 7న ఐర్లాండ్‌లోని డొనెగల్‌లో జన్మించారు.

ఆమె Dublinలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రజారోగ్య పరిపాలనలో, కిమ్మేజ్ ఇన్‌స్టిట్యూట్‌లో అంతర్జాతీయ అభివృద్ధి అధ్యయనంలో మాస్టర్స్ డిగ్రీలను పొందారు.

2022 నుంచి 2025 వరకు, ప్రపంచవ్యాప్త సువార్తా ప్రచారంపై అధ్యయనం మరియు సమాచార సేవా సంస్థ (SEDOS)కు అధ్యక్షురాలిగా సేవలందించారు. 

అలాగే, 2023 నుంచి 2025 వరకు ఇటలీలోని రోమ్‌లో ఉన్న సుపీరియర్స్ జనరల్ అంతర్జాతీయ సమాఖ్యకు అధ్యక్షురాలిగా సేవలు అందించారు.

2018 నుండి అవర్ లేడీ ఆఫ్ అపోస్టల్స్ మిషనరీ సిస్టర్స్ సభకు సుపీరియర్ జనరల్‌గా సేవలందిస్తున్నారు.

Telugu Survey Popup Image