సాహెల్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి ప్రయత్నాలకు విజ్ఞప్తి చేసిన పోప్

ఆదివారం మే 10 న వారపు రెజీనా కేలీలో అట్లాంటిక్ మహాసముద్రం మరియు ఎర్ర సముద్రం మధ్య ఉత్తర ఆఫ్రికా దక్షిణ అక్షాంశాలలో విస్తరించి ఉన్న సాహెల్ ప్రాంతంలోని అస్థిర పరిస్థితిపై పోప్ లియో ఆందోళన వ్యక్తం చేశారు.

వాటికన్‌లో రెండవ జాన్ పాల్ ఫౌండేషన్ ఫర్ ది సాహెల్ ప్రతినిధులతో సమావేశమైన మరుసటి రోజు  "సాహెల్ ప్రాంతంలో, ముఖ్యంగా చాద్ మరియు మాలిలో హింస పెరగడం, అక్కడ ఇటీవల ఉగ్రవాద దాడులు జరగడం గురించిన వార్తలకు పోప్ ఆందోళన వ్యకతంచేశారు.

బాధితుల కోసం తాను ప్రార్థినల హామీ ఇచ్చారు, బాధపడుతున్న వారందరికీ తన సాన్నిహిత్యాన్ని తెలియజేశారు, మరియు శాంతిని ప్రోత్సహించడానికి నిరంతర ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

"ప్రతి రూపంలోని హింస అంతం కావాలని నేను ఆశిస్తున్నాను, మరియు అక్కడ శాంతి మరియు అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని నేను ప్రోత్సహిస్తున్నాను," అని పోప్ అన్నారు.

దక్షిణాన ఉన్న తేమతో కూడిన సూడాన్ సవన్నాలకు, ఉత్తరాన ఉన్న పొడి సహారాకు మధ్య పరివర్తన ప్రాంతంగా ఉండటంతో పాటు, ఈ ప్రాంతానికి పర్యావరణ, వాతావరణ ప్రాముఖ్యత కూడా ఉంది. అంతేకాకుండా, ఇది దీర్ఘకాలంగా అంతర్గత అస్థిరత, బాహ్య వ్యూహాత్మక పోటీలచే ప్రభావితమైన ఒక భౌగోళిక-రాజకీయ ప్రదేశం కూడా.

వాతావరణ సంక్షోభం తరచుగా ఆహారం, నీటి కొరతకు కారణమవుతూనే ఉంది. ప్రభుత్వ అవినీతి తిరుగుబాట్లు, అల్లర్లు, తీవ్రవాదానికి దారితీసింది.