శాసన గ్రంథాల మండలికి నూతన ప్రిఫెక్ట్ను నియమించిన పోప్
ఆర్చ్‌బిషప్ Anthony Randazzoను శాసన గ్రంథాల మండలి ప్రిఫెక్ట్‌గా పోప్ లియో నియమించినట్లు, హోలీ సీ ప్రెస్ ఆఫీస్ బుధవారం, మార్చి 25, 2026న ఒక బులెటిన్‌లో ప్రచురించింది.
ఇప్పటివరకు ఆస్ట్రేలియాలోని Broken Bay పీఠాధిపతిగా మరియు Oceania కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న వీరికి, పోప్ ఆర్చ్‌బిషప్ అనే వ్యక్తిగత బిరుదును కూడా ప్రసాదించారు.
సెప్టెంబర్ 26న పోప్ లియో, ఆర్చ్‌బిషప్ Filippo Iannoneను పీఠాధిపతుల డికాస్టరీ ప్రిఫెక్ట్‌గా నియమించారు. జనవరి 2023 నుండి మే 2025 వరకు ఇయాన్నోన్ నిర్వహించిన ఈ పదవిని ఆర్చ్‌బిషప్ Anthony భర్తీ చేయనున్నారు.
ఆర్చ్‌బిషప్ Anthony తన అధికారిక ఫేస్బుక్ పేజీలో, "నాపై ఉంచిన నమ్మకానికి పోప్ లియోకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను." అని రాసారు
Broken Bay మేత్రాసనానికి, విశ్వాసులకు మరియు గురువులకు పీఠాధిపతిగా సేవ చేయడం నిజమైన ఆనందాన్ని ఇస్తుందని కూడా ఆయన అన్నారు.
ఆర్చ్‌బిషప్ తన కొత్త బాధ్యతలను ప్రారంభించడానికి రోమ్కు వెళ్లే ముందు అనగా రాబోయే మూడు నెలల పాటు Broken Bay కు అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉంటారు.