లాజియో యువతతో సమావేశమైన పోప్ లియో
ఇటలీలోని లాజియో ప్రాంతానికి చెందిన 6,000 మందికి పైగా యువత నవంబర్ 21, శనివారం వాటికన్లోని ఆరవ పాల్ హాలులో పోప్ లియోతో ప్రపంచ యువజన దినోత్సవ ప్రాంతీయ వేడుకల్లో పాల్గొననున్నారు.
ఇటలీలోని లాజియో ప్రాంత పీఠాధిపతుల సమాఖ్య యువజన సువార్తీకరణ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సమావేశానికి 2027లో దక్షిణ కొరియాలోని సియోల్లో జరగనున్న ప్రపంచ యువజన దినోత్సవ ఇతివృత్తమైన “ధైర్యము వహింపుడు. నేను లోకమును జయించితిని” (యోహాను 16:33) అనే వాక్యాన్ని ప్రధానాంశంగా నిర్ణయించారు.
వెరోనికా మారియా జెనోవేసే నాయకత్వంలో, రిన్యూవల్ ఇన్ ద స్పిరిట్ ఉద్యమ ప్రాంతీయ గాయక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది.
ఉదయం 9:45 గంటలకు Tivoli ,Palestrina మేత్రాసన పీఠాధిపతి Mauro Parmeggiani ప్రార్థనా కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు.
అనంతరం యువత తమ విశ్వాస అనుభవాలు, దైవ పిలుపు, మిషనరీ సేవలు, యుద్ధ పరిస్థితుల్లో ఎదురైన అనుభవాలను పంచుకుంటారు.
రోమ్ మేత్రాసనానికి పోప్ ప్రతినిధి కార్డినల్ బాల్దస్సారే రైనా ప్రసంగం అనంతరం లాజియో ప్రాంతంలోని వివిధ మేత్రాసనాలకు ప్రాతినిధ్యం వహించే ఐదుగురు యువత అడిగే ప్రశ్నలకు పోప్ సమాధానమిస్తారు. చివరగా జ్ఞానస్నాన వాగ్దానాల పునరుద్ధరణతో కార్యక్రమం ముగుస్తుంది.
యువత జీవితంలోని లోతైన అర్థాన్ని అన్వేషించేందుకు, దేవుడు అందించే దైవ పిలుపును ధైర్యంగా స్వీకరించేందుకు ప్రోత్సహిస్తుందని పీఠాధిపతి మౌరో పార్మెజ్జాని ఆశాభావం వ్యక్తం చేశారు.
