లట్వియా రిపబ్లిక్ అధ్యక్షుడుతో సమావేశమైన పోప్ లియో

వాటికన్‌లో Latvia రిపబ్లిక్ అధ్యక్షుడు Edgarsను పోప్ లియో సెప్టెంబర్ 4 న అధికారికంగా కలిసారు అని వాటికన్ ప్రెస్ ఆఫీస్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది

అనంతరం అధ్యక్షుడు, పవిత్ర తండ్రి రాష్ట్ర కార్యదర్శి కార్డినల్ పియెట్రో పరొలిన్‌ను కలిసారు 

ఈ సమావేశంలో రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి  ఆర్చ్‌బిషప్ పాల్ రిచర్డ్ గల్లఘర్ కూడా పాల్గొన్నారు.

రాష్ట్ర కార్యదర్శిత్వంలో జరిగిన స్నేహపూర్వక చర్చల్లో, హోలీ సీ మరియు లాట్వియా రిపబ్లిక్ మధ్య కొనసాగుతున్న సత్సంబంధాల పట్ల సంతృప్తి వ్యక్తమైంది.

అంతర్జాతీయ మరియు ప్రాంతీయ స్థాయిలలో పరస్పర ఆసక్తికి సంబంధించిన అంశాలపై కూడా చర్చలు జరిగాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితిపై దృష్టి సారించారు.

శాంతియుత పరిష్కారాలను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ సమాజం మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Telugu Survey Popup Image