మాడ్రిడ్‌కు నూతన మైలురాయిగా 82 అడుగుల సిలువ
మాడ్రిడ్ నగరంలోని 'ప్లాజా డి లిమా'లో యువతతో పోప్ లియో జరిపిన ప్రార్థనా కార్యక్రమం సమయంలో, భారీ జనసమూహం మధ్య 82 అడుగుల ఎత్తైన సిలువ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పోప్ లియో స్పెయిన్ పర్యటన కోసం దీనిని ఏర్పాటు చేశారు, కానీ ఇప్పుడు అది నగర దృశ్యంలో ఒక శాశ్వత మైలురాయిగా మారే అవకాశం ఉంది.
"యువతతో పోప్ లియో జరిపిన ప్రార్థనా కార్యక్రమానికి సాక్షిగా నిలిచిన ఆ భారీ శిలువ, పోప్ చారిత్రాత్మక పర్యటనకు జ్ఞాపకంగా మరియు మన క్రైస్తవ మూలాలకు చిహ్నంగా మాడ్రిడ్‌లోనే ఉండిపోతుంది." అని నగర కౌన్సిల్ రెండవ డిప్యూటీ మేయర్ బోర్జా కరాబాంటే సోషల్ మీడియాలో ఈ ప్రత్యేక ప్రకటన చేశారు
ఆ సిలువ అక్కడే ఉంటుందని నిర్ధారించినప్పటికీ, దానిని అదే ప్రదేశంలో ఉంచుతారా లేక వేరే చోటికి మారుస్తారా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఏది ఏమైనప్పటికీ, పోప్ లియో పర్యటనకు సంబంధించిన ఈ జ్ఞాపకం నగరంలో ఒక భాగంగా మారనుందన్న వార్త స్పెయిన్‌లోని విశ్వాసులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.