మడగాస్కర్‌లో వినాశకరమైన తుఫానుల బాధితుల కొరకు ప్రార్ధించమన్న పోప్

ఫిబ్రవరి 15 న త్రికాల ప్రార్థన అనంతరం అతి తక్కువ సమయంలో రెండు తుఫానుల ప్రభావంతో బాధపడుతున్న మడగాస్కర్ ప్రజలకు పోప్ లియో తన సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేశారు.

బాధితుల కుటుంబాల కొరకు మరియు తీవ్ర నష్టాన్ని చవిచూసిన వారందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను" అని పోప్అన్నారు.

ఈ సంవత్సరం నైరుతి హిందూ మహాసముద్రంలో తుఫానుల తీవ్రంగా ఉండటం వల్ల మడగాస్కర్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

Gezani మరియు Fytia  తుఫానుల తరువాత అంతర్జాతీయ సహాయం కోసం విజ్ఞప్తి చేసింది.

గెజాని తుఫాను ఫిబ్రవరి 10న తీరాన్ని తాకి దాదాపు 2,70,000 మందిని నిరాశ్రయులను చేసింది మరియు వేలాది మందిని స్థానభ్రంశం చెందారు. 40 మంది మరణించినట్లు జాతీయ అధికారులు నివేదించారు.

Telugu Survey Popup Image