ప్రపంచ సంక్షోభాలు విస్మరించలేనన్న పోప్
కొన్ని సంక్షోభాలు ప్రపంచ వార్తల్లో ప్రధానంగా నిలుస్తుండగా, మరికొన్ని ఎవరికీ తెలియకుండానే నిశ్శబ్దంగా కొనసాగుతున్నాయి.
నవంబర్ 22 ఆదివారం త్రికాల ప్రార్థన సందర్భంగా పోప్ లియో యుద్ధ బాధితుల కోసం ప్రార్థిస్తూ, ప్రపంచం పెద్దగా గుర్తించని మరో తీవ్రమైన సంక్షోభమైన కరువు పరిస్థితులపై దృష్టి సారించారు.
క్రీస్తు రాజు మహోత్సవం సందర్భంగా హింసాకు గురవుతున్న వారందరి కోసం ప్రార్థించాలని పోప్ పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక ఘర్షణలు మరణాలకు, బాధలకు కారణమవుతున్నాయని, వాటిని నివారించి సయోధ్య, శాంతి నెలకొల్పేందుకు బాధ్యులు తక్షణమే పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోరారు.
మరోవైపు, ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్న పాపువా న్యూ గినియా సహా పసిఫిక్ దేశాల ప్రజలకు తన సంఘీభావాన్ని ప్రకటిస్తూ, బాధితులకు సహాయం చేస్తున్న వారిని అభినందించారు.
యుద్ధం, కరువు వంటి భిన్నమైన సంక్షోభాల మధ్య చిక్కుకున్న నిరుపేదలు, బలహీన వర్గాల పట్ల పోప్ లియో ప్రత్యేక శ్రద్ధ వహించారు.
