దివంగత పోప్ ఫ్రాన్సిస్‌ను స్మరించుకున్న పోప్

పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21, 2025లో ఈస్టర్ సోమవారం నాడు మరణించారు. ఏప్రిల్ 6,2026 సోమవారం సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుండి జరిగిన రెజీనా కేలీ కార్యక్రమంలో, పోప్ లియో దివంగత పోప్ ఫ్రాన్సిస్‌ను స్మరించుకున్న కొన్ని మాటలు పంచుకున్నారు.

పునరుత్థానం చెందిన వాని వెలుగులో, ప్రత్యేక ఆప్యాయతతో, గత సంవత్సరం సరిగ్గా ఈస్టర్ సోమవారం నాడు ప్రభువుకు తన ప్రాణాన్ని అర్పించిన పోప్ ఫ్రాన్సిస్‌ను ఈ రోజు మనం స్మరించుకుంటున్నాము అని పోప్ అన్నారు 

ఇటలీలో ఈ రోజు జాతీయ సెలవుదినం. దీనిని "దేవదూత సోమవారం" లేదా "చిన్న ఈస్టర్" అని పిలుస్తారు. 

ఈ రోజున, యేసు సమాధి వద్ద స్త్రీలకు దేవదూత ప్రత్యక్షమై పునరుత్థానాన్ని ప్రకటించిన సువార్తను శ్రీసభ గుర్తుచేసుకుంటుంది.

ఈ దేవదూత సందేశాన్ని పంచుకోవలసిన ఆవశ్యకతను పోప్ లియో తెలిపారు.

చరిత్రను కలుషితం చేసి, మనసాక్షిని గందరగోళపరిచే చెడు వలన పీడింపబడుతున్న వారికి ఈ సువార్త చేరడం ఎంతో ముఖ్యం! 

నేను యుద్ధం వల్ల పీడింపబడిన ప్రజల గురించి, తమ విశ్వాసం కారణంగా హింసించబడిన క్రైస్తవుల గురించి, విద్యకు దూరమైన పిల్లల గురించి ఆలోచిస్తున్నాను.  

ఈస్టర్ కాలంలో ఏంజెలుస్ స్థానంలో రెజీనా కేలీని పఠిస్తారు. 

ఈస్టర్ ఆదివారం నుండి పెంతెకోస్తు ఆదివారం వరకు, అంటే ఏడు వారాల పాటు దీనిని పఠిస్తారు.