కామెరూన్ విమానాశ్రయంలో దివ్యబలిపూజను సమర్పించిన పోప్

ఒక విమానాశ్రయ రన్‌వేపై పోప్ లియో దివ్యబలి పూజ సమర్పించడం ఇది మొదటిసారి, బహుశా ఇదే చివరిసారి కూడా కావచ్చు.

పోప్ తన అపోస్తొలిక పర్యటనలో భాగంగా రాజధానికి తిరిగి వెళ్ళడానికి కామెరూన్ నగరాన్ని విడిచి వెళ్ళే ముందు, బమెండా విమానాశ్రయంలో ఈ ప్రత్యేక దివ్యబలి పూజ జరిగింది.

పోప్ తన పోప్‌మొబైల్‌లో ఈ విశాలమైన, బహిరంగ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ దివ్యబలి పూజను జరుపుకోవడానికి సంగీతం, నృత్యాలతో ఆయన కోసం ఎదురుచూస్తున్న క్రైస్తవ విశ్వాసులు గుమిగూడారు .

ఈ ప్రాంతం ప్రస్తుతం 'ఆంగ్లోఫోన్ సంక్షోభం'గా పిలువబడే ఒక హింసాత్మక సంఘర్షణలో చిక్కుకుంది. 

ఈ నేపథ్యంలోనే కామెరూన్ మరియు ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను పోప్ లియో ప్రస్తావించారు.

కొనసాగుతున్న ఆహార సంక్షోభం, అనేక రకాల పేదరికం మధ్య, ఇటీవలి కాలంలో కూడా ఇది ఎంతో మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది

నైతిక, సామాజిక మరియు రాజకీయ అవినీతి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది . ఇది అన్నింటికంటే ఎక్కువగా సంపద నిర్వహణలో కనిపిస్తుంది. 

ఇది సంస్థలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.

పోప్ గారు వారికి ప్రోత్సాహకరమైన మరియు ఆశాజనకమైన మాటలు కూడా చెప్పారు, 

యుద్ధాన్ని, ప్రతికూలతను, మరియు కష్టాలను అధిగమించి, ఇప్పటి నుండే కొత్తగా పునర్నిర్మించుకోవాలని వారిని కోరుతూ,ఈ దేశ పరిస్థితిని మార్చడానికి, రూపాంతరం చెందించడానికి ఇదే సరైన సమయం అని పోప్ లియో పిలుపునిచ్చారు 

ఈ దివ్యబలి పూజ అనంతరం పోప్ బమెండా విమానాశ్రయంలో ఆత్మీయ వీడ్కోలు అందుకున్నారు.

Tags