ఆస్ట్రియా రిపబ్లిక్ అధ్యక్షుడితో సమావేశమైన పోప్ లియో

మార్చి 5 గురువారం ఉదయం వాటికన్‌లో ఆస్ట్రియా రిపబ్లిక్ అధ్యక్షుడు  Alexander Van der Bellen పోప్ లియోను కలిసారు 

పోప్ తో సమావేశం అనంతరం అధ్యక్షుడు Alexander వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌ను, ఆయనతో పాటు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి ఆర్చ్ బిషప్ పాల్ రిచర్డ్ ను కూడా కలిసారు 

హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో స్నేహపూర్వక చర్చలు జరిగాయి.హోలీ సీ మరియు ఆస్ట్రియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

సమాజ మంచిని ప్రోత్సహించడంలో కతోలిక శ్రీసభ సానుకూల సహకారాన్ని వివరించారు  

వలసలు,మతాంతర సంబంధాలతో సహా, కొన్ని ప్రత్యేక సమయోచిత సమస్యల గురించి కూడా ప్రస్తావించారు.

ప్రస్తుత అంతర్జాతీయ సమస్యలపై ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాలలో శాంతియుత పరిష్కారాల అన్వేషణలో అంతర్జాతీయ సమాజం పోషించాల్సిన ముఖ్య పాత్రపై ఆశను వ్యక్తం చేశారు