గిరిపుత్రులందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు
గిరిపుత్రులందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు
ప్రకృతితో మమేకమై జీవిస్తూ, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ, అవసరమైనపుడు హక్కులకోసం గళమెత్తుతున్న ఆదివాసీల జీవన విధానం మాకందరికీ ఎంతో ఆదర్శం.భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆచారాలు, దుస్తులు మొదలైనవి ఇతర వ్యక్తుల నుండి భిన్నంగా ఉంటాయి.
ప్రపంచంలోని 90 కి పైగా దేశాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలోని గిరిజన జనాభా దాదాపు 37 కోట్లు. ఇందులో దాదాపు 5000 విభిన్న గిరిజన తెగలు ఉన్నాయి. వారికి సుమారు 7 వేల భాషలు ఉన్నాయి. బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసీలే. వారు నివసించే ప్రాంతాలు పుష్కలమైన సహజవనరులతో కళకళలాడుతుండేవి. నేడు ఆ వనరులు దోపిడీకి గురౌతున్నాయి. 'అతి పురాతన సనాతన ప్రజల (మూలవాసులు) తెగలు అంతరించిపోతున్నాయి. సాటి మానవులుగా అనేక దేశాలలో వారికి తగిన గుర్తింపు, రక్షణ లేదు. ఆయా దేశాలలో కనీసపు చట్టాలు కూడా లేవు. ఫలితంగా వారు మానవులుగా జీవించడానికి పోరాడవలసిన స్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇదే మణిపూర్ లో కూడా జరుగుతుంది.
1994 లో అమెరికాలో మొదటిసారిగా గిరిజన దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుండి, ప్రతి ఏటా ఆగస్టు 9 వ తేదీని ప్రపంచవ్యాప్తంగా గిరిజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1994 లో మొదటిసారిగా అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల సంవత్సరంగా ప్రకటించింది.