విశాఖ అతిమేత్రాసనం, మధురవాడ విచారణలో గల పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవము ఘనంగా జరిగింది. విచారణ గురువులు గురుశ్రీ ప్రకాష్ (TOR) గారి ఆధ్వర్యంలో ఈ మహోత్సవము ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది.
విశాఖ అతిమేత్రాసనం, మధురవాడ విచారణలో గల పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. విచారణ గురువులు గురుశ్రీ ప్రకాష్ గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు మొదలైనవి.
విశాఖ అతిమేత్రాసనం ఎర్ర సామంతవలస గిరిజన విచారణలో 18 ఆగష్టు, ఆదివారం నాడు జాతీయ యువతా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, ఎర్ర సామంతవలస విచారణ కర్తలు గురుశ్రీ పి జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
విశాఖ అతిమేత్రాసనం యర్ర సామంతవలస విచారణ, క్రీస్తురాజు పుణ్య క్షేత్రంలో " ఒక్క రోజు సంపూర్ణ వెన్నెల రాత్రి జాగరణ ప్రార్థన" భక్తియుతంగా జరిగింది. ఆదివారం రాత్రి క్రీస్తు రాజు పురం లోని పనసబద్ర నూతన దేవాలయం లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జరిగింది.
విశాఖ అతిమేత్రాసనం సెయింట్ ఆన్స్ కో కథెడ్రల్ విచారణ, పునీత అన్నమ్మగారి మహోత్సవ నవదిన ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. విచారణ కర్తలు గురుశ్రీ మరియారత్నం గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.
విశాఖ అతిమేత్రాసనంలో ప్రసిద్ధి గాంచిన "కోడూరుమాత మహోత్సవం" ప్రతి ఏటా సెప్టెంబర్ రెండవ శనివారం జరుగుతుంది. వివిధ ప్రాంతాలనుండి అధిక సంఖ్యలో భక్తులు కోడూరుమాత ను దర్శించుకుంటారు.ఈ సంవత్సరం సెప్టెంబరు 14 వ తేది కోడూరుమాత మహోత్సవం జరగనున్నది.
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో తపస్సు కాల పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనా కూడిక భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.