ప్రత్యేక సమావేశం
పవిత్రాత్మ నూతనీకరణ జాతీయ మహాసభల నిర్వహణపై విజయవాడలో సమావేశం
విజయవాడ: 2027, జనవరి 9, 10, 11, తేదీలలో జరగనున్న పవిత్రాత్మ నూతనీకరణ జాతీయ మహాసభల ఏర్పాట్లు, నిర్వహణపై చర్చించేందుకు విజయవాడలో ఈరోజు ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సిరో-మలబార్, శంషాబాద్ అగ్రపీఠాధిపతులు మహా ఘన ప్రిన్స్ అంతోని గారు , విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు మహా పూజ్య రాజారావు గార్లు ముఖ్యతిధులుగా పాల్గొన్నారు. నేషనల్ కోఆర్డినేటర్ విక్టర్ గారు , కరిస్మాటిక్ కోఆర్డినేటర్స్, NST సభ్యులు ఫాదర్ హృదయ రాజ్, ఫాదర్ యోహాన్, ఫాదర్ చిన్నప్ప, వివిధ మిత్రసన్ కోఆర్డినేటర్లు, గురువులు, కన్యాస్త్రీలు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త, ఆధ్యాత్మిక ప్రసంగీకులు "బ్రదర్ సత్యం వాడపల్లి" గారు మరియు యువత విభాగం నుండి జాతీయ యువత కోఆర్డినేటర్ "మెరుగు ప్రశాంత్" పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో జరగనున్న ఈ మహాసభలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణ, పాల్గొనే వారి సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
పవిత్రాత్మ నూతనీకరణ ద్వారా విశ్వాసులను మరింతగా మన ప్రభువైన యేసు క్రీస్తు వైపు నడిపించడం, ప్రార్థనా జీవితాన్ని బలోపేతం చేయడం, సువార్త సేవకు విశ్వాసులను సిద్ధం చేయడం వంటి అంశాలపై కూడా సమావేశంలో దృష్టి సారించారు.
Article and Design By M Kranthi Swaroop
