ఘనంగా సెయింట్ పీటర్స్ డే వేడుకలు
ఘనంగా సెయింట్ పీటర్స్ డే వేడుకలు
బోయన్పల్లి, జయనగర్ లో ఉన్న ప్రసిద్ధ విద్యాసంస్థ సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్ (St. Peter's Grammar School) లో సెయింట్ పీటర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలు విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ రణధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ సుధాకర్ గారు పాల్గొన్నారు.
ఫాదర్ సుధాకర్ గారు మాట్లాడుతూ "పునీత పేతురు గారు దేవుని ఆజ్ఞకు, పిలుపునకు పూర్తిగా లోబడి నడుచుకున్నారు అని, అలానే విద్యార్థులు కూడా టీచర్స్ కు లోబడి ఉండాలని సూచించారు.
స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి గారు మాట్లాడుతూ పునీత పేతురు (Saint Peter) గారు తన జీవితంలో అడుగడుగునా గొప్ప వినయాన్ని, నిరాడంబరతను ప్రదర్శించారు అని తెలిపారు. విద్యార్థులు తమకు విద్యను నేర్పే గురువులను గౌరవించాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి గారు , స్కూల్ ఇంచార్జ్ మహిత రాజ్ గారు , ఇతర టీచర్స్ పాల్గొన్నారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు.
హైదరాబాద్లోని, జయ నగర్, న్యూ బోయన్పల్లి ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ విద్యాసంస్థ సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్ (St. Peter's Grammar School). ఇది నర్సరీ నుండి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లీష్ మీడియం కో-ఎడ్యుకేషనల్ పాఠశాల. ఇక్కడ నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి (క్రీడలు, సృజనాత్మకత) ప్రాధాన్యత ఇస్తారు. బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, మరియు ఇండోర్ గేమ్స్ వంటి వివిధ రకాల ఆటలలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఎన్సిసి (NCC - National Cadet Corps) శిక్షణను ఒక ముఖ్యమైన భాగంగా అందిస్తోంది.
Article and Design By M Kranthi Swaroop