సామాజిక మాధ్యమం ద్వారా పేదలకు గృహ నిర్మాణ చేసిన కపుచిన్ గురువు
భారతీయ కపుచిన్ గురువు గురుశ్రీ జిజో కురియన్ గారు పేదల కోసం చిన్న గృహాలను నిర్మించడానికి సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించారు.
2018 నుండి, గురుశ్రీ జిజో గారు , తన సహకారులతో కలిసి దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో దాదాపు 350 తక్కువ-ధరలో పేదలకు గృహాలను నిర్మించారు.
హౌసింగ్ యూనిట్లకు సామాజిక మాధ్యమం అనుచరులు, స్థానిక,అంతర్జాతీయ స్నేహితులు మరియు ఇతరులకు సహాయపడాలి అనే హృదయం కలిగినవారి మద్దతు ఎక్కువగా ఉంది అన్నారు జిజో
ప్రారంభంలో, జిజో గారు తక్కువ ఖర్చుతో క్యాబిన్ హౌస్‌లను నిర్మించారు. తరువాత, అతను వాటిని 420 చదరపు అడుగుల, రెండు పడక గదులు, వంటగది, టాయిలెట్ మరియు ప్రవేశ ద్వారంతో మినీ-హోమ్‌గా మార్చారు. ఒకొక్క ఇంటి ధర సుమారు US$5394.
వీరి బృందం హౌసింగ్ ప్రాజెక్ట్ సమాచార పట్టికను సామాజిక మాధ్యమం పోస్ట్‌లు మరియు ఇతర సామాజిక మాధ్యమం మార్గాల ద్వారా దాతలకు మరియు ఇతరుల కొరకు చేయబడి ఉంచుతుంది.
"మేము ఎవరి నుండి నేరుగా నిధులను కోరము," అని గురుశ్రీ కురియన్ అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో భాగం కాని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ హౌసింగ్ లబ్ధిదారులలో ఉన్నారు.
వితంతువులు, మంచాన పడిన రోగులు, వికలాంగులు, మానసికంగా లేదా శారీరకంగా వికలాంగులు మరియు క్యాన్సర్ రోగులకు సహా అర్హులైన లబ్ధిదారులను జాగ్రత్తగా ఎంపిక చేస్తుంది. అంతేకాకుండా, లబ్ధిదారులు మతం లేదా సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఎక్కడి నుండైనా వస్తారు.
చొరవ ఉద్దేశించిన లబ్ధిదారులు పూర్తయిన ఇళ్లను స్వీకరించినప్పుడు, వారి గోప్యతను రక్షించడానికి ఫోటో అవకాశాలు లేదా ప్రచురణలు ఉండవు.
పోషకులు ఉన్నంత వరకు గృహనిర్మాణ కార్యక్రమం కొనసాగుతుందని గురుశ్రీ కురియన్ గారు అన్నారు.