హృదయంతో ఆలకిద్దాం అని విశ్వాసులను ప్రోత్సహించిన పోప్

బుధవారం సెప్టెంబర్ 2 న జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో పోప్ లియో రెండవ వాటికన్ మహాసభకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలపై తన బోధనలను చేసారు,

ఈసారి ఆయన గౌదియుమ్ ఎట్ స్పెస్ (Gaudium et Spes) అనే పత్రంపై తన ధ్యానాన్ని ప్రారంభించారు. ఇది ఆధునిక ప్రపంచంలో శ్రీసభ పాత్రను, బాధ్యతను వివరిస్తుంది.

ప్రపంచంలోని ప్రజల **సంతోషాల్లో, దుఃఖాల్లో భాగస్వామ్యమవుతూ**, మార్పు దిశగా పయనించడానికి, క్రీస్తు కార్యానికి సాక్ష్యమివ్వడానికి, పేదలు మరియు అణగారిన వారి పక్షాన నిలబడటానికి ఇది పిలుపునిస్తుంది.

అలాగే, **కాల సంకేతాలను గమనించి**, వాటిని సువార్త వెలుగులో అర్థం చేసుకోవాలని శ్రీసభ  పిలుపునిస్తుంది. 

తద్వారా కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూర్చే సాంకేతిక పురోగతి, ఇంకా కొనసాగుతున్న విస్తృత పేదరికం వంటి అత్యవసర సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి.

మన కాలం ఎన్నో మార్పులతో పాటు అనేక అన్యాయాలను కూడా ఎదుర్కొంటోంది. అందువల్ల మనలో ప్రతి ఒక్కరూ తన వంతు పాత్రను నిర్వర్తించాలి. **మానవ హృదయంలోని లోతైన ప్రశ్నలను, ఆకాంక్షలను స్వాగతిస్తూ, వాటిని ఆలకిస్తూ**, మన రక్షకుడైన క్రీస్తు కరుణామయ ప్రేమను ప్రతి ఒక్కరికీ పంచాలి 

అరబ్ లో మతాంతర సంభాషణ మరియు సహకార వేదిక ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నాను.

King Abdullah bin Abdulaziz  ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటర్‌రీలిజియస్ అండ్ ఇంటర్‌కల్చరల్ డైలాగ్ అందిస్తున్న సేవలను నేను అభినందిస్తున్నాను. మీ సమావేశాలు విజయవంతం కావాలని ప్రార్థిస్తున్నాను అని పోప్ అన్నారు 

దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక అని పోప్ తన ప్రసంగాన్ని ముగించారు 
 

Telugu Survey Popup Image