కాస్టెల్ గాండోల్ఫోలో నిరుపేదలతో కలిసి భోజనం చేసిన పోప్ లియో

కాస్టెల్ గాండోల్ఫోలో వేసవి విశ్రాంతి తీసుకుంటున్న పోప్ లియో మరోసారి తమ నిరాడంబరతను, పేదల పట్ల ఉన్న ప్రేమను చాటిచెప్పారు.

రోమ్ మేత్రాసనానికి చెందిన సుమారు 200 మంది నిరుపేదలు, నిరాశ్రయులు, వలసదారులు, శరణార్థులు, అలాగే అవసరాల్లో ఉన్న కుటుంబాలతో కలిసి పోప్ లియో  ఆత్మీయంగా భోజనం చేశారు.

ఈ కార్యక్రమం "సృష్టి సంరక్షణ" కోసం ప్రత్యేకంగా అర్పించిన దివ్యబలిపూజతో ప్రారంభమైంది. అనంతరం పాల్గొన్నవారు, పోంటిఫికల్ విల్లాల్లో ఏర్పాటు చేసిన బోర్గో లౌదాతో సీ ప్రాంగణాన్ని సందర్శించారు. 

సమగ్ర పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వాటికన్ ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమమే ఈ బోర్గో లౌదాతో సీ.

అనంతరం జరిగిన సామూహిక భోజనంలో పోప్ లియో అందరితో ఒకే బల్లపై కూర్చొని భోజనం చేస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. 

ఈ సందర్భంగా ప్రసంగించిన పోప్ లియో, తాను ప్రసంగంతో కాకుండా ఆకలితో వచ్చానని అన్నారు. అయితే అది కేవలం ఆహారం కోసం కాదని, న్యాయం కోసం, నిజమైన ప్రేమ కోసం, ప్రతి ఒక్కరినీ ఆహ్వానించి, ఆదరించే సంఘం కోసం తన హృదయంలో ఉన్న తపన అని వివరించారు.

గత ఏడాది లౌదాతో సీ ఉన్నత విద్యా కేంద్రం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి ఏడాది ఒక ధర్మప్రాంతానికి చెందిన అవసరాల్లో ఉన్న ప్రజలను బోర్గో లౌదాతో సీకి ఆహ్వానించి, పోప్‌తో ఒక రోజు గడిపే అవకాశాన్ని కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

పేదలు, అణగారిన వర్గాల పట్ల సంఘం మరింత ప్రేమతో, బాధ్యతతో వ్యవహరించాలని పోప్ లియో