CCBI క్రైస్తవ సమైక్యతా విభాగ నూతన కార్యదర్శిగా గురుశ్రీ కొండవీటి అంతయ్య

బెంగళూరులో మే 6 మరియు 7, 2025 తేదీలలో జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CCBI) క్రైస్తవ సమైక్యతా విభాగ నూతన కార్యదర్శిగా గురుశ్రీ డాక్టర్ అంతయ్య కొండవీటిని నియమించారు

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు మేత్రాసనానికి చెందిన గురుశ్రీ అంతయ్య దాదాపు మూడు దశాబ్దాల అర్చక పరిచర్యను శ్రీసభకు అందించారు.

1969 మే 5న కట్రపాడులో జన్మించిన ఆయన 1995 ఏప్రిల్ 27న గురువుగా అభిషేకింపబడ్డారు.

రోమ్‌లోని పోంటిఫికల్ అర్బన్ విశ్వవిద్యాలయం నుండి డాగ్మాటిక్ థియాలజీలో డాక్టరేట్ ను

మరియు వ్యవస్థాత్మక వేదాంతశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్,గురువిద్యాలయా ఫార్మేటర్లకు రిఫ్రెషర్ కోర్సు అధ్యయనాలను పూర్తిచేశారు

శ్రీసభలో పాస్టోరల్ మరియు విద్యా రంగాలకు ఆయన చేస్తున్నసేవ కొలవలేనిది.

గురుశ్రీ అంతయ్య గతంలో CCBIకి అసిస్టెంట్ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు.

హైదరాబాద్‌లోని పునీత భక్త యోహాను గురువిద్యాలయంలో వ్యవస్థాత్మక వేదాంతశాస్త్రం మరియు ఆధ్యాత్మిక నిర్దేశకుడుగా తన సేవను అందించారు.

తన స్వస్థలమైన నెల్లూరు మేత్రాసనంలో విచారణ గురువుగా మరియు సెక్రటరీ కూడా పనిచేశారు.

ప్రస్తుతం తెలుగు కథోలిక పీఠాధిపతుల మండలి క్రైస్తవ సమైక్యతా విభాగ ప్రాంతీయ కార్యదర్శిగా మరియు తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు.

వివిధ వేదాంత సంస్థలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తున్నారు

తెలుగు, ఆంగ్ల మరియు ఇటాలియన్ భాషలలో నిష్ణాతుడైన గురుశ్రీ అంతయ్య తన వేదాంత జ్ఞానం మరియు క్రైస్తవ ఐక్యతకు నిబద్ధతకు ప్రసిద్ధి చెందారు.

CCBI లో ఆయన నూతన పాత్ర భారతదేశం అంతటా క్రైస్తవ సమాజాల మధ్య సమైక్యతను, మతాంతర సంభాషణను మరియు సహకారాన్నిపెంపొందించే ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుందని కోరుకుంటూ అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున హార్దిక శుభాకాంక్షలు