"శాంతి సాధన పాఠశాల "లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

"శాంతి సాధన పాఠశాల "లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

విశాఖ అతిమేత్రాసనం , గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్లోని "శాంతి సాధన పాఠశాల " లో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రాంగణాన్ని మావిడాకులతో పూలతో చాలా చక్కగా ఆకర్షణీయంగా అలంకరించారు.

ఈ కార్యక్రమంలో శాంతి సాధన పాఠశాల కరస్పాండెంట్ గురుశ్రీ  హ్యారి ఫిలిప్స్, ప్రిన్సిపాల్ సిస్టర్  భాగ్యమేరీలు ఇతర టీచర్లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థుల వివిధ రంగురంగుల సాంప్రదాయ దుస్తులలో వచ్చి పండుగ వాతావరణం కళ్ళముందు నిలిపారు.  పాఠశాల  ప్రాంగణంలో పల్లె మరియు పండుగ వాతావరణం కనిపించింది.  

 సంక్రాంతి ముగ్గులు , సంక్రాంతి అలంకరణలు,   కూచిపూడి , భరత నాట్యం , రైతు వేషధారణలు వంటి కార్యక్రమాలు విద్యార్థులు నిర్వహించారు. ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులను పాఠశాల సిబ్బంది అందించారు.గురుశ్రీ  హ్యారి ఫిలిప్స్ గారు మాట్లాడుతూ మారుతున్నా ఈ కాలంలో "ఇటువంటి ఉత్సవాలు చేయటం ద్వారా విద్యార్థినీ విద్యార్థుల్లో మన సంస్కృతీ సంప్రదాయాలు అవగాహన కలుగుతుందని,విద్యతో పాటు ఇటువంటి విలువలతో కూడిన కార్యక్రమాలు చేయటంలో "శాంతి సాధన పాఠశాల " ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు.

 

Article By
M Kranthi Swaroop
RVA Telugu Online Producer