"టిసిబిసి - క్రైస్తవ సమైక్య విభాగం మరియు అంతరమత సంవాదం" విభాగ డియోసెసన్ డైరెక్టర్ల సమావేశం ఘనంగా జరిగింది.
"టిసిబిసి - క్రైస్తవ సమైక్య విభాగం మరియు అంతరమత సంవాదం" విభాగ డియోసెసన్ డైరెక్టర్ల సమావేశం ఘనంగా జరిగింది.
"టిసిబిసి - క్రైస్తవ సమైక్య విభాగం మరియు అంతరమత సంవాదం" విభాగ డియోసెసన్ డైరెక్టర్ల సమావేశం నవంబర్ 7 & 8 తేదీల్లో విజయవాడలోని బిషప్ హౌస్‌లో జరిగింది. విజయవాడ పీఠాధిపతులు మరియు చైర్మన్ మహా పూజ్య టి.జోసెఫ్ రాజారావు గారి అధ్యక్షత ఈ సమావేశం జరిగింది . ఈ సమావేశంలో తెలుగు ప్రాంతంలో జరుగుతున్న సర్వమత మరియు మతపరమైన కార్యకలాపాలను మహా పూజ్య టి.జోసెఫ్ రాజారావు గారు సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన అధ్యక్షులు పాల్గొన్నారు. క్రైస్తవ ఐక్యత మరియు చర్చల మంత్రిత్వ శాఖ యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, పాల్గొన్న వారు అనేక సూచనలు అందించారు. క్రైస్తవులు మరియు ఇతర మతాలకు చెందిన వ్యక్తులతో సంబంధాలను పెంచుకోవడంలో మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కమీషన్ల ఎపి రాష్ట్ర కోఆర్డినేటర్ మొన్సిగ్నోర్ గురుశ్రీ మువ్వల ప్రసాద్ గారు వివిధ మతాలలో సత్సంబంధాలు కోసం ప్రాథమిక విలువలను గుర్తించడంపై ఆవశ్యకతను వివరించారు.
ఈ కార్యక్రమంలో బౌద్ధమతం, సిక్కు మతం, ఇస్లాం మరియు క్రైస్తవ మతాల ప్రతినిధులు తమ తమ మతాలలో ప్రేమ, సేవ, త్యాగం, స్వీయ నియంత్రణ, కలుపుగోలుతనం, ఆతిథ్యం, మరొకరి పట్ల గౌరవం, సమానత్వం మొదలైన ప్రధాన విలువలను తెలియజేసారు.
ప్రాంతీయ కార్యదర్శి గురుశ్రీ కే అంతయ్య గారు ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసారు .