అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించిన ఆల్ ఇండియా కాథలిక్ యూనియన్
అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించిన ఆల్ ఇండియా కాథలిక్ యూనియన్
విశాఖ అతిమేత్రాసనం, విశాఖపట్నం లో ఆల్ ఇండియా కాథలిక్ యూనియన్ మరియు సెయింట్ పీటర్స్ ఉమెన్ కమీషన్ వారు జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు . . 1948లో మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే హత్య చేసినందుకు గుర్తుగా జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా జాతీయంగా గుర్తించబడింది . ఈ రొజున భారత రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, రాజ్ ఘాట్ వద్దనున్న గాంధీ సమాధి వద్ద నివాళులుఅర్పిస్తారు.
జాతీయ అమరవీరుల దినోత్సవం సందర్భముగా ఆల్ ఇండియా కాథలిక్ యూనియన్ మరియు సెయింట్ పీటర్స్ ఉమెన్ కమీషన్ జ్ఞానాపురం వారు నగరంలోని GVMC కార్యాలయం ఎదుట ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు.అందరు కొవ్వొత్తులు వెలిగించి అమరవీరుల దినోత్సవాన్ని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం లో గురుశ్రీ జాకబ్ రెడ్డి గారు, శ్రీ గోన స్వామినాధం గారు, శ్రీ బి.వి.రవీంద్ర శేషుబాబు గారు, శ్రీ వేపాడ రాజా రావు గారు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer