శ్రీసభ ప్రస్తుత సవాళ్లు మరియు సినడల్ చర్చి
హైదరాబాద్ అగ్రపీఠం, పునీత యోహాను గురువిద్యాలయము నందు తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య దైవ పిలుపుల, గురువుల, దైవాంకితుల విభాగం వారు జనవరి 10 ,11 న గురువులకు రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించనున్నాయి.
ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి ముఖ్య నిపుణుడు నాగపూర్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఎలియాస్ గొంజాల్వేస్ గారు విచ్చేసారు.
"శ్రీసభ ప్రస్తుత సవాళ్లు మరియు సినడల్ చర్చి" అనే నేపథ్యంపై ఈ సమావేశం జరగనుందని దైవ పిలుపుల, గురువుల, దైవాంకితుల విభాగం కార్యదర్శి గురుశ్రీ పెంటరెడ్డి రాజా గారు తెలిపారు.
నల్గొండ పీఠానికి చెందిన గురుశ్రీ మాదాను ఫ్రాన్సిస్ గారి పవిత్రగ్రంథ పఠనానంతరం, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభమైన ఈ సమావేశానికి వివిధ ప్రాంతాలనుండి గురువులు హాజరయ్యారు అని RVA తెలుగు విభాగం కోఆర్డినేటర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు తెలిపారు.