మడగాస్కర్ పీఠాధిపతులతో సమావేశమైన పోప్

2025 జూబ్లీ సంవత్సరంలో భాగంగా రోమ్‌కు తీర్థయాత్ర చేస్తున్న మడగాస్కర్ పీఠాధిపతులు  సోమవారం జూన్ 16 న వాటికన్‌లో పోప్ లియోతో సమావేశమయ్యారు.

2019లో పోప్ ఫ్రాన్సిస్ ఈ దేశానికి చేసిన అపోస్టోలిక్ సందర్శన మరియు 2022లో రోమ్‌కు చేసిన పీఠాధిపతులు జగద్గురువుని సందర్శన తర్వాత, వాటికన్ కు వారు రావాలనే వారి నిర్ణయాన్ని పోప్ తన ప్రసంగంలో ప్రశంసించారు.

“ప్రతిరోజూ పాపల్ బసిలికాన పవిత్ర ద్వారాలను దాటే వేలాది మంది విశ్వాసులతో కలిసి మీరు నిరీక్షణా యాత్రికులుగా మారడం చాలా అందంగా ఉంది” అని పోప్అన్నారు.

"మీ పరిచర్యలో మీ మొదటి సహకారులు మరియు మీ సన్నిహిత సోదరులు అయిన గురువులను, అలాగే సేవలో తమ జీవితాన్ని గడిపే మఠవాసులను ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలని పోప్ పీఠాధిపతులకు పిలుపునిచ్చారు 
 
మడగాస్కర్ లో మిషనరీ శక్తిని గురించి ప్రస్తావిస్తూ తమ మొదటి ప్రేషితుడు Henri de Solages మరియు దేశంలో పునీత పట్టం పొందనున్న మొదటి అమరవీరుడు సెయింట్ Jacques Berthieu  అడుగుజాడలను అనుసరిస్తున్నారు అని పోప్ ప్రశంసించారు 

"పేదల నుండి మీ దృష్టిని మరల్చవద్దని వారిలో క్రీస్తును చూడాలని పీఠాధిపతులను ఆహ్వానించారు.

సృష్టి పట్ల శ్రద్ధ మడగాస్కర్ ప్రవచనాత్మక లక్ష్యంలో అంతర్భాగమని చెబుతూ, మన ఉమ్మడి గృహం భూగ్రహాని జాగ్రత్తగా చూసుకోవాలని పోప్ లియో ముగించారు.

Tags
Telugu Survey Popup Image