ప్రభువు చేసిన స్వస్థతలపై దృష్టి సారించిన పోప్ లియో

బుధవారం జూన్ 11 సామాన్య ప్రేక్షకుల సమావేశంలో యేసు జీవితంలో మరొక ముఖ్యమైన అంశం - ఆయన చేసిన స్వస్థతలపై మన దృష్టిని కేంద్రీకరించాలని పోప్ కోరారు.

జెరూసలేంకు వెళ్లే మార్గంలో జెరిఖో నగరం గుండా వెళుతున్నప్పుడు యేసుకు మొరపెట్టిన బర్తిమయి అనే అంధుడిని స్వస్థపరచడం గురించి పోప్ సువార్త వృత్తాంతంలో పేర్కొన్నారు.

మీ జీవితంలో మీకు అత్యంత బాధ కలిగించే, బలహీనంగానున్న అంశాలను,ముందుకు కదలలేక పోతున్నట్లు భావించే పరిస్థితులను, క్రీస్తు హృదయంలో ఉంచమని మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. 

బర్తిమయిని ప్రభువు పిలువగా తన సంపూర్ణ దుర్బలత్వంతో యేసు ముందు నిలబడ్డాడు. తన దృష్టిని తిరిగి పొందగల ప్రభువు శక్తిపై నమ్మకం ఉంచాడు. 

మనం కూడా, స్వస్థత కోసం మన స్వంత అవసరాన్ని గుర్తించి, మన బలహీనతతో ప్రభువు వద్దకు రావాలి. ఆయన స్వస్థపరిచే శక్తిని అనుభవించడానికి మన భద్రతలు, మన సౌకర్యవంతమైన ప్రదేశాలు - విడిచిపెట్టాలి.

ఈ నిరీక్షణ జూబిలీ సమయంలో, విశ్వాస వెలుగులో అన్నింటినీ కొత్తగా చూడటానికి, మరియు స్వేచ్ఛతో, నూతన జీవితంతో ప్రభువును అనుసరించడానికి మనం కూడా కృషి చెయాలి అని పోప్ ముగించారు 
 

Tags
Telugu Survey Popup Image