ద్రాక్షారామం విచారణలో భద్రమైన అభ్యంగనం స్వీకరించిన విశ్వాసులు

ద్రాక్షారామం విచారణలో భద్రమైన అభ్యంగనం  స్వీకరించిన విశ్వాసులు

విశాఖ అతిమేత్రాసనం ద్రాక్షారామం విచారణలో సెప్టెంబర్ 22,2024 ఆదివారంనాటి  దివ్యబలి పూజలో 42 మంది విశ్వాసులు భద్రమైన అభ్యంగనం స్వీకరించారు. విచారణ కర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర గురువులతో కలసి దివ్య పూజాబలిని సమర్పించారు. మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు.

మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారి చేతులమీదుగా 42 మంది విశ్వాసులు భద్రమైన అభ్యంగనం స్వీకరించారు. వారందరి కొరకు పీఠాధిపతుల వారు ప్రత్యేక ప్రార్థనలు చేసారు.

విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. విచారణ సహాయక గురువులు గురుశ్రీ విమల్ రాజ్ గారు ఎప్పటిలాగానే తన సహాయ సహకారాలను అందించారు.

విచారణ గురువులు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారు ఈ కార్యక్రమం విజయవతంగా జరగడానికి సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి  హృదయపూర్వక  కృతజ్ఞతలు తెలియచేసారు.

Telugu Survey Popup Image