ఇజ్రాయెల్ దాడులు 'మానవత్వం లేనివి : లెబనీస్ కార్డినల్
ఇజ్రాయెల్ దాడులు 'మానవత్వం లేనివి : లెబనీస్ కార్డినల్
కార్డినల్ మహా పూజ్య బెచారా రాయ్ గారు లెబనాన్‌పై వైమానిక దాడులను ఖండించారు మరియు UN జోక్యం చేసుకోవాలని కోరారు.
మెరోనైట్ పాట్రియార్క్ కార్డినల్ మహా పూజ్య బెచారా రాయ్ గారు లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల పై "ప్రగాఢమైన విచారం" వ్యక్తం చేసినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ NNA (National News Agency)సెప్టెంబర్ 22న నివేదించింది.
సెప్టెంబర్ 22న తన ఆదివారం ప్రసంగంలో, ఇజ్రాయెల్ దాడులు "మానవత్వం లేనివి" అని అయన అన్నారు.
సెప్టెంబరు 21 ఉదయం ఒక గంటలో దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ విమానం మొత్తం 111 వైమానిక దాడులను నిర్వహించిందని, ఇజ్రాయెల్ సైన్యం దాదాపు 180 హిజ్బుల్లా లక్ష్యాలను చేధించిందని NNA నివేదించింది.
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భాగంగా హమాస్‌కు మద్దతుగా హిజ్బుల్లా గత సంవత్సరం ఉత్తర ఇజ్రాయెల్‌లోకి రాకెట్ల దాడి ప్రారంభించినప్పటి నుండి ఇజ్రాయెల్ వైమానిక దాడుల సంఖ్య అత్యధికంగా నమోదైందని CNN నివేదించింది.
కార్డినల్ మహా పూజ్య బెచారా రాయ్ గారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని మరియు "కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకాలని" పిలుపునిచ్చారని NNA నివేదించింది. తన ప్రసంగంలో, కార్డినల్ రాయ్ లెబనాన్ యొక్క మారుతున్న రాజకీయ దృశ్యం గురించి "లోతైన ఆందోళన" వ్యక్తం చేశారు
సెప్టెంబరు 20న బీరుట్ సబర్బ్‌లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన " దాడి" లో మరణించిన వారి సంఖ్య 37కి పెరిగింది, ఇందులో ఏడుగురు మహిళలు మరియు ముగ్గురు పిల్లలు ఉన్నారు అని లెబనాన్ ఆరోగ్య మంత్రి సెప్టెంబర్ 21న చెప్పారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer