శ్రీసభ ఆచార్య పాలక క్రమము సేవ కొరకేనన్న పోప్

మార్చి 25,మంగళవార్త మహోత్సవం రోజున సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో పోప్ లియో ప్రసంగించారు.

గత కొన్ని వారాలుగా, ఈ సమావేశం రెండవ వాటికన్ ప్రసిద్ధ పత్రమైన 'Lumen Gentium' పై దృష్టి సారించింది. 

"శ్రీసభ ఆచార్య పాలక క్రమము " ఈ సమావేశ ప్రధాన ఇతివృత్తంగా ఉంది.

సువార్త పట్ల ఆసక్తి ఉన్న వారిని , జ్ఞానస్నానం పొందిన వారందరి మేలుకు అంకితమైన వారిని మరియు ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో ధైర్యగా పరిచర్య చేయగల వారిని   పంపమని ప్రభువును ప్రార్థిద్దాం.

కతోలిక సంఘంలో వివిధ స్థాయిలలో సేవలందిస్తున్న కార్డినల్ లు,పీఠాధిపతులు,గురువులు,డీకన్లు ఉన్న నాయకత్వ నిర్మాణం మనుషులు తయారుచేసుకున్న వ్యవస్థ కాదని

ఇది క్రీస్తు తన అపోస్తలులకు అప్పగించిన కర్తవ్యాన్ని యుగాంతం వరకు కొనసాగించడానికి చేసిన ఏర్పాటు అని పోప్ అన్నారు

యుద్ధ ఉన్మాదంతో నిండిన ప్రస్తుత కాలంలో, గర్భధారణ నుండి సహజ అంతం వరకు జీవాన్ని రక్షించడం చాలా ముఖ్యం.

పోప్ లియో తాను పాల్గొనబోయే కార్యక్రమాల కోసం ఇప్పటికే సిద్ధమవుతున్నారు: మార్చి 28న మొనాకోకు ఆయన తదుపరి పర్యటన చేయనున్నారు.

Tags