వ్యర్ధ పలుకులను విడనాడాలని పిలుపునిచ్చిన పోప్

ఈ సంవత్సరం తపస్సు కాల సమయంలో విశ్వాసులు "వ్యర్ధ పలుకులను విడనాడాలని పోప్ లియో పిలుపునిచ్చారు

ఈ పవిత్ర సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన అపూర్వమైన కృపా కాలంగా అభివర్ణించారు. ఉపవాసం అంటే కేవలం ఆహార నియమాలు పాటించడం మాత్రమే కాదని; ఇతరులను బాధించే, ద్వేషాన్ని పెంచే మాటల నుండి దూరంగా ఉండాలని ఆయన అన్నారు.  

దేవుని వాక్యాన్ని ఆలకించడం ద్వారా మన హృదయాలు మార్పు చెందుతాయని, క్రీస్తు బాధ, మరణం మరియు పునరుత్థాన రహస్యాన్ని అనుసరించడానికి మనం సిద్ధం కావాలని చెప్పారు.

బాధపడుతున్నవారిని ఆదరించడం, పేదల పట్ల కరుణ చూపించడం,ఒంటరితనంలో ఉన్నవారికి తోడుగా నిలవడం ఇవే తపస్సుకాలంలో నిజమైన ఆత్మపరిశీలన ఫలితాలని పోప్ స్పష్టం చేశారు.

అయితే ఉపవాసం వినయం మరియు విశ్వాసంతో చేయాలని హెచ్చరించారు.

ప్రత్యేకంగా, ఇతరులను దూషించే మాటలు, అపవాదులు, తొందరపాటు తీర్పులు వంటి వాటిని నివారించాలని ఆయన సూచించారు. కుటుంబాలలో, 

కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో శాంతి నెలకొనాలంటే మన మాటల్లో ప్రేమ, గౌరవం, క్షమాభావం ప్రతిఫలించాలి అని ఆయన బోధించారు.

ఈ విధంగా జీవిస్తే ద్వేషభరితమైన మాటలు తగ్గి, ఆశ మరియు శాంతి సందేశాలు పెరుగుతాయని పోప్ లియో XIV అన్నారు.

Tags
Telugu Survey Popup Image