వెస్ట్ బ్యాంక్‌లో హింసకు ముగింపు పలకాలని పిలుపునిచ్చిన పోప్

వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనీయులపై జరుగుతున్న హింసాత్మక చర్యలకు వెంటనే ముగింపు పలకాలని మరోసారి పోప్ లియో పిలుపునిచ్చారు.

ఆదివారం ఆగస్టు 16 త్రికాల ప్రార్థన అనంతరం అంతర్జాతీయ సంస్థలు...చొరవ తీసుకుని, న్యాయమైన మరియు శాశ్వతమైన శాంతి కోసం ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు-దేశాలు  పరిష్కారం దిశగా ముందుకు సాగాలని కోరారు.

ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా దేశాలు అంతర్జాతీయంగా గుర్తించబడిన సురక్షిత సరిహద్దుల్లో శాంతి, భద్రతలతో పక్కపక్కనే జీవించాలన్నది హోలీ సీ వైఖరి. 

ఇందుకు బలప్రయోగం కాకుండా సంభాషణ, సహకారం, బహుపాక్షిక చర్చలే మార్గమని హోలీ సీ స్పష్టం చేస్తోంది.

అదే సందర్భంగా, ఇటలీలోని టరాంటో నగరంలో ప్రారంభమైన మెడిటరేనియన్ క్రీడలు మధ్యధరా ప్రాంత ప్రజల మధ్య శాంతి, సోదరభావానికి “ప్రవచనాత్మక సంకేతంగా” నిలవాలని పోప్ ఆకాంక్షించారు. 

హోలీ సీకి చెందిన అథ్లెటికా వాటికానా సంస్థ తరఫున నలుగురు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

చివరగా, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన యాత్రికులను పోప్ లియో అభినందించారు. 

పోలాండ్‌లోని Piekary Śląskie పుణ్యక్షేత్రానికి నిర్వహించిన సంప్రదాయ మహిళల తీర్థయాత్రలో పాల్గొన్న వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Telugu Survey Popup Image