వాటికన్‌లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న పీఠాధిపతులు

ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి నూతనంగా నియమితులైన పీఠాధిపతులు ఈ శిక్షణ కొరకు రోమ్‌లో సమావేశమవుతారు 

ఐదు ఖండాలకు చెందిన 147 మంది నూతనంగా నియమితులైన పీఠాధిపతులు  వాటికన్‌లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

వారు ఎనిమిది రోజుల పాటు రోమ్‌లోని **పొంటిఫికల్ అర్బన్ యూనివర్సిటీ**లో తమ కొత్త బాధ్యతలకు అవసరమైన శిక్షణ పొందారు. 

ఈ శిక్షణలో సువార్త సేవ, పాస్టరల్ పరిచర్య, దైవార్చనను రక్షించడం,శ్రీసభ పరిపాలన వంటి ముఖ్యమైన అంశాలపై శిక్షణ అందించారు. 

“సాధారణంగా వీరు ఉదయం 7 గంటలకు దివ్యబలిపూజతో ప్రారంభమవుతుంది. అనంతరం అల్పాహారం తీసుకుని ఉపన్యాసాలకు వెళ్తాము. సాధారణంగా ఉదయం రెండు ఉపన్యాసాలు, మధ్యాహ్నం ఒక ఉపన్యాసం ఉంటాయి. అయితే, కార్యక్రమాన్ని బట్టి సమయపట్టిక మారుతూ ఉంటుంది.”

ఈ ఉపన్యాసాల ద్వారా నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాల్సి ఉంటుంది.

“అలాగే మాకు భాషల ఆధారంగా సమూహ చర్చలు కూడా ఉంటాయి. ఆయా భాషలకు చెందిన పీఠాధిపతులు కలిసి, మాకు ఇచ్చిన అంశంపై చర్చిస్తాము. స్థానిక శ్రీసభల్లో ప్రతిపాదించిన విషయాలు మన పరిస్థితులకు ఎలా అన్వయిస్తాయో పరస్పరం పంచుకుంటాము.” అని మోన్సిగ్నోర్ అల్ఫోన్సో బౌయర్ అన్నారు

ఈ శిక్షణలో బోధకులుగా కార్డినల్స్, వాటికన్ విభాగాల అధిపతులు, అగ్రపీఠాధిపతులు పాల్గొంటారు.

ఈ కార్యక్రమం చివరలో పీఠాధిపతులు సెయింట్ పీటర్స్ బసిలికాలో పవిత్ర బలిపూజ**తో పాటి పోప్ లియో ను కలుసుకున్నారు.

Telugu Survey Popup Image