లాటిన్ అమెరికా పర్యటనను ప్రారంభించిన పోప్
లాటిన్ అమెరికా పర్యటన నవంబర్ 7 న అధికారికంగా ప్రారంభమైంది. ఉరుగ్వే రాజధాని మాంటెవీడియోలోని Carrasco అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం 4:20 గంటలకు పోప్ అక్కడికి చేరుకున్నారు.
ఉరుగ్వే అధ్యక్షుడు Yamandú Orsiతో పాటు చర్చి ప్రముఖులు పోప్‌కు ఘన స్వాగతం పలికారు. వారిలో మాంటెవీడియో అగ్రపీఠాధిపతి, కార్డినల్ Daniel Sturla, ఉరుగ్వే కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మహా పూజ్య Milton Tróccoli, అపోస్టోలిక్ నున్షియో Gianfranco Gallone తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా చిన్నారులు పోప్‌కు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సైనికులు గౌరవ స్వాగతం పలికారు. అనంతరం సైనిక వైమానిక స్థావరంలో ప్రత్యేక స్వాగత కార్యక్రమం నిర్వహించారు.
సంప్రదాయం ప్రకారం, విమాన ప్రయాణ సమయంలో పోప్ లియో తాను ప్రయాణించిన దేశాలకు టెలిగ్రామ్‌లు పంపారు.
ఈసారి Italy, France, Algeria, Mauritania, Senegal,Brazil దేశాలకు టెలిగ్రామ్‌లు పంపించారు.
